కొండా సురేఖకు KTR లీగల్ నోటీసు
NEWS Oct 02,2024 04:40 pm
హీరోయిన్లను ఉద్దేశిస్తూ తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు సంబంధం లేని అంశాలపై ఆమె అబద్దాలు మాట్లాడారని, తన గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని, అసత్యాలు మాట్లాడారని మండిపడ్డారు. కొండా సురేఖ సారీ చెప్పకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని హెచ్చరించారు.