కాలువలో పడి వ్యక్తి గల్లంతు
NEWS Oct 02,2024 04:31 pm
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దుంపేట గ్రామ శివారులోని వరద కాలువలో వ్యక్తి గల్లంతయ్యాడు. ఇదే మండలానికి చెందిన చింతకుంట గ్రామానికి చెందిన మల్లేశ్ గా గుర్తించారు. వరద కాలువను ఆనుకొని అతని బైకు పడి ఉంది. వరద కాలువలో నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. బైకు నంబర్ ప్లేట్ ఓ చోట బైకు మరోచోట పడి ఉంది. పోలీసులు వరద కాలువ వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు.