సాయిబాబా విగ్రహాల తొలగింపు
NEWS Oct 02,2024 04:17 pm
సాయిబాబా హిందూ దేవుడు కాదని, ఆయన విగ్రహాలను తొలగించాలన్న హిందూ సంస్థల పిలుపుతో వారణాసిలోని ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగిస్తున్నారు. సనాతన్ రక్షక్ సేన అజయ్ శర్మ నేతృత్వంలో ఇప్పటి వరకు 14 ఆలయాల నుంచి బాబా విగ్రహాలను తొలగించగా, మరో 28 ఆలయాల్లోని విగ్రహాలను కూడా తొలగించనున్నారు. సనాతన ధర్మంతో సాయిబాబాకు ఎలాంటి సంబంధం లేదని, సాయిబాబాను పూజించడాన్ని తాము వ్యతిరేకించబోమని, హిందూ ఆలయాల్లో ప్రతిష్ఠించడానికి వ్యతిరేకమని తేల్చి చెప్పాయి.