సమంత స్ట్రాంగ్ రియాక్షన్
NEWS Oct 02,2024 04:08 pm
నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంత స్పందించారు. నన్ను రాజకీయాల్లోకి లాగకండి. మహిళలను వస్తువుల్లా చూస్తూ ఉన్న ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా ధైర్యం కావాలి. డైవోర్స్ నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరి అంగీకారంతో జరిగింది. నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచండంటూ సమంత చెప్పింది.