ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
NEWS Oct 02,2024 04:30 pm
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు పట్టణంలోని హమాలివాడలో బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. మహిళలు తీరక పూలతో బతుకమ్మలు పేర్చి ఆడి పాడారు. చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలంతా బతుకమ్మ ఆడుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పిల్లలు, మహిళలు పాల్గొన్నారు.