పనులు గుర్తించుటకు గ్రామసభలు
NEWS Oct 02,2024 04:29 pm
రొళ్ల మండల వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద 2025-26 ఆర్ధిక సంవత్సరం నకు సంబందించిన పనులు గుర్తింపు కొరకు బుధవారం రొళ్ల, మళ్లీన మడుగు, రత్నగిరి, బీజీ హళ్లి, కాకి, గుడ్డ గురికి గ్రామ పంచాయితీలలో ఏపీవో ఓబులప్ప ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సభ సర్పంచ్ అధ్యక్షతనతో పంచాయతీ కార్యదర్శి చే గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధి కూలీలు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు