పేద విద్యార్థినికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం
NEWS Oct 02,2024 04:18 pm
ఆగలి మండలానికి చెందిన నలిన అనే విద్యార్థిని డిగ్రీ పూర్తి చేసుకుని పీజీ చేయడం కోసం ప్రవేశ పరీక్ష రాయగా బుక్కరాయసముద్రం మండలం సెంట్రల్ జైలు వద్ద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలో సీటు వచ్చింది. ఆ విద్యార్థినికి తండ్రి లేకపోవడంతో ఆర్థిక స్థోమత లేక స్వయంగా ఆమె మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు ఫోన్ కాల్ చేయగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు విద్యార్థి నలిన పీజీలో చేరేందుకు అడ్మిషన్ కోసం 15వేలు ఆర్థిక సాయం చేశారు.