PK: జన్ సురాజ్ పార్టీ ఆవిర్భావం
NEWS Oct 02,2024 01:29 pm
పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీని ప్రారంభించారు. జన్ సురాజ్ పార్టీ అధికారంలోకి వస్తే బీహార్‌లో మద్యనిషేధాన్ని ఎత్తివేస్తామని పీకే ప్రకటించారు. బీహార్‌ను ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు రాబోయే పదేళ్లలో రూ.5 లక్షల కోట్లు అవసరమని చెప్పారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా పలువురు నేతలు ఆ పార్టీలో చేరారు.