2025 నాటికి బందరు పోర్టు పూర్తి
నిర్మాణ పనులు పరిశీలించిన చంద్రబాబు
NEWS Oct 02,2024 12:34 pm
వైసీపీ ప్రభుత్వంలో రూ.3,669 కోట్ల అంచనాతో చేపట్టిన బందరు పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరగక కేవలం 24శాతమే పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు అన్నారు. పోర్టు నిర్మాణానికి అవసరమయ్యే మరో 38.32 ఎకరాల భూమి ఇచ్చి.. 2025 నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు. ఇది పూర్తైతే అమరావతికి కూడా దగ్గరగా ఉంటుంది. కంటైనర్ పోర్టు కింద ఇంటిగ్రేడ్ చేస్తే తెలంగాణసహా పలు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు.