కరాటే మాస్టర్‌కు సన్మానం
NEWS Oct 02,2024 01:11 pm
ఇటీవలే నిర్మల్‌లో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో బండాలింగాపుర్ నవీన్ మాస్టర్ విద్యార్థులు 19 మంది పాల్గొన్నారు. ఇందులో 7గురు విద్యార్థులు బంగారు పథకాలు సాధించారు. ఈ సందర్బంగా బండాలింగాపుర్ సంస్థాన్ ఘడిలో నవీన్ మాస్టర్‌ను, తన గురువు జిల్లా ప్రధాన కరాటే శిక్షకులు ప్రవీణ్ కుమార్ ను గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చెప్పాల రాజం, జంగ గంగస్వామి, జంగిటి రాజేందర్ తదితరులు సన్మానించారు.