ఘనంగా గాంధీజీ జయంతి వేడుకలు
NEWS Oct 02,2024 01:45 pm
మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా మల్యాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గాంధీజీ సత్యం, అహింస శక్తి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తినిస్తూనే ఉందని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దొంగ ఆనందరెడ్డి, దారం ఆదిరెడ్డి, అల్లూరి రాజేశ్వర్ రెడ్డి, ఆగంతపు వంశీధర్, కాటిపల్లి శ్రీనివాస్, నల్లపు మల్లేశం, ఇమామ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.