జైల్‌లో ఖైదీల సంక్షేమ దినోత్సవం
NEWS Oct 02,2024 01:21 pm
గాంధీ జయంతి సందర్బంగా జగిత్యాల స్పెషల్ సబ్ జైల్ లో ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జ్ నారాయణ, సీనియర్ సివిల్ జడ్జ్, సెక్రెటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కె. ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖైదీలు గాంధీ మార్గంలో నడిచి సమాజంలో సత్ప్రవర్తనతో నడుచుకోవాలన్నారు. జైల్‌లో ఖైదీల సంక్షేమం గురించి చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.