స్వచ్ఛత హిసేవలో కార్మికులకు సన్మానం
NEWS Oct 02,2024 12:42 pm
మునిసిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కోరుట్ల పట్టణంలో ఉత్తమ పనితీరు కనబరుస్తున్న పారిశుద్ధ కార్మికులు కనూరి కిరణ్ కుమార్, బొల్లె నరేష్, చిట్యాల బుచ్చమ్మ, రాగుల భాగ్య, వావిలాల కనకతారలను శాలువాతో సన్మానించి, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ చిట్యాల శ్రీనివాస్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ శివకుమార్, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.