మహాత్మా గాంధీకి ఎమ్మెల్యే నివాళి
NEWS Oct 02,2024 08:46 am
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్. అహింసా మార్గంలో ఉద్యమించి బానిస సంకెళ్లు తెంచి బ్రిటిష్ పాలకుల నుంచి దేశానికి విముక్తి కలిగించిన మహాత్ముడి బోధనలు నేటికీ అనుసరణీయం ఆత్మాభిమానం, ఆత్మగౌరవం వేరెవరో పరిరక్షించరు. మనకు మనమే వాటిని కాపాడుకోవాలని ఆయన చెప్పిన మాటలు స్ఫూర్తిదాయకమని, జాతిపిత చూపిన బాటను అందరూ అనుసరిస్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడమే మన ముందున్న కర్తవ్యమని తెలిపారు.