పెద్దరామావాస్య పెద్దలకు బియ్యం ఇచ్చుకోవడం
NEWS Oct 02,2024 08:47 am
ఈ అమావాస్య పెద్దల అమావాస్యగా పిలువడం జరుగుతుంది, ఈ పెద్దల అమావాస్యనాడు మన చనిపోయిన వారికి బియ్యం ఇచ్చుకోవడం అంటారు. ఈ విధంగా చేయడం వల్ల వారి ఆత్మలకు సంతృప్తి కలుగుతుందని మన పూర్వీకుల అభిప్రాయం. ఈ విధంగానే అప్పటినుండి ఇప్పటివరకు కొనసాగుతూ వస్తుంది. ఇలా చేయడం ద్వారా చనిపోయిన వారు ఎక్కడ ఉన్నా కానీ వారి కి ఆత్మ సంతృప్తి, మనకు వారిపై ఉన్న అభిమానం చాటుకున్నట్లు అని తెలుపుతున్నారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అందరూ పెద్దలకు బియ్యం ఇచ్చుకుంటున్నారు.