పంచాయతీ సిబ్బందికి సత్కారాలు
NEWS Oct 02,2024 12:45 pm
కథలాపూర్ మండలంలోని దుంపేట గ్రామంలో ప్రత్యేక అధికారి శ్రీనివాస్ దుంపేట గ్రామపంచాయతీ సిబ్బందిని శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి, ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది ఎల్లవేళలా గ్రామ ప్రజలు అనారోగ్యానికి కాకుండా చూసుకునేవారని చెప్పారు. వారు బాగుంటేనే గ్రామం బాగుంటుందన్నారు. అనంతరం గాంధీ జయంతి వేడుకలు, గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, కారబర్ గని, స్వామి, అంగన్వాడి కార్యకర్తలు సునీత, ఏఎన్ఎంలు, వీఏలు, పాల్గొన్నారు.