ఏలూరు కాల్ మనీ ఘటనపై హోంమంత్రి అనిత సీరియస్
NEWS Oct 02,2024 07:31 am
రోజూవారీ వడ్డీ పేరుతో సామాన్య ప్రజలను జలగల్లా పీల్చి పిప్పి చేసే కాల్ మనీ ఘటనలను సహించబోమని హోమంత్రి అనిత అన్నారు. ఏలూరు ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి కాల్ మనీ వ్యవహారం గురించి ఆరా తీశారు. వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి, వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని అనిత అన్నారు.