రేపు తిరుపతిలో వారాహి డిక్లరేషన్..!
జనసైనికులకు దిశానిర్దేశం చేయనున్న పవన్
NEWS Oct 02,2024 07:20 am
డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన కుమార్తెలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకాన్ని వెంట తీసుకువెళ్లారు. సనాతన ధర్మానికి సంబంధించిన కీలకమైన అంశాలతో ఈ బుక్ రూపొందించినట్లు సమాచారం. గురువారం తిరుపతిలో నిర్వహించే వారాహి సభలో పవన్ తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు.