మల్లాపూర్ లో గాంధీ జయంతి వేడుకలు
NEWS Oct 02,2024 08:42 am
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.