ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
NEWS Oct 02,2024 08:44 am
కథలాపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజీమ్, సత్యనారాయణ, అనంతరెడ్డి లింగారావు, అశోక్ , రాష్ట్ర కాంగ్రెస్ ఫిషర్మెన్ కార్యదర్శి గంగాధర్, నారాయణరెడ్డి, మధు, లవ్ కుమార్, శ్రీను, తిరుపతి రెడ్డి, మాజీ ఎంపిటిసి శిరీష ప్రసాద్, ధనుంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.