కట్ట బ్రాహ్మణ విగ్రహ ఆవిష్కరణ
NEWS Oct 02,2024 06:23 am
వీర పాండ్యా కట్ట బ్రాహ్మణ విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మంగళవారం కథలాపూర్ మండలం తూర్తి గ్రామంలో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో నెలకొల్పిన వీర పాండ్య కట్ట బ్రాహ్మణ విగ్రహావిష్కరణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తుర్తి ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.