పాఠశాలలో బతుకమ్మ వేడుకలు
NEWS Oct 02,2024 06:20 am
కథలాపూర్ మండలంలోని కళాధర పబ్లిక్ పాఠశాలలో తెలంగాణ పండుగ బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక గణాత్మక గుర్తించే విధంగా పండుగను విద్యార్థులు వేషధారణతో బతుకమ్మను ముచ్చటగా పేరించారు. అనంతరం బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సంబరాలు చేసుకున్నారు. జగిత్యాల జిల్లా రైతు నాయకులు, కళాధార పబ్లిక్ స్కూల్ చైర్మన్ గడ్డం భూమారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు తెలంగాణ సాంస్కృతిక మీద పట్టు ఉండాలని అన్నారు. డైరెక్టర్ దివాకర్ ప్రిన్సిపల్ నాగేందర్ ప్రవీణ, తదితరులు పాల్గొన్నారు.