చంద్రబాబు ఇంటిపై దాడి కేసు..
అన్ని వేళ్లూ మాజీ మంత్రి జోగి రమేష్ వైపే..!
NEWS Oct 02,2024 06:11 am
గతంలో ఉండవల్లిలో చంద్రబాబు నివాసంపై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మంగళగిరి పోలీసులు ఎదుట మూడోసారి విచారణకు హాజరయ్యారు. బాబు ఇంటిపై దాడికి జోగి రమేష్ దగ్గరుండి తమను తీసుకొచ్చారని.. ఆయనే దాడి చేయాలని ఆదేశించారని కేసులో నాలుగో నిందితుడు పి.దుర్గాప్రసాద్ విచారణలో చెప్పినట్టు సమాచారం. ఈ నేథప్యంలో దాడికి జోగినే కారణమని అనుమానిస్తున్నారు.