గుండెపోటుతో బిజెపి నేత మృతి
NEWS Oct 02,2024 06:24 am
కోరుట్ల పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యదర్శి పీసరి నర్సయ్య బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతితో పట్టణంలో విషాదం నెలకొంది. ఆయన పార్తివదేహానికి బిజెపితో పాటు వివిధ పార్టీల నాయకులు తదితరులు నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయన మృతి తీరని లోటని పేర్కొన్నారు.