మనోహరాబాద్ మండలం కూచారం, ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో మటన్, చికెన్ దుకాణాలపై గ్రామ పంచాయతీ అధికారులు దాడులు నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా విక్రయాలు చేస్తున్న రెండు దుకాణాలకు రూ. 4 వేల చొప్పున జరిమానా విధించారు. కార్యక్రమంలో ఎంపీఓ లక్మి నర్సింహులు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్, స్వామి, పోలీసులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.