పూలనే దైవంగా పూజించే ప్రత్యేక పండుగ బతుకమ్మ. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచి ప్రకృతితో అనుబంధాన్ని ప్రస్ఫుటం చేస్తుంది. అతివల అస్తిత్వానికి అద్దంపడుతూ వారి సృజనాత్మక శక్తిని ప్రతిబింబిస్తుంది. పూల అమరిక నుంచి పాటల ఆలాపన వరకు ప్రతిదీ మనోహరంగా ఆవిష్కృతమవుతుంది. నేటి నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం సందర్బంగా మీ అందరికి శుభాకాంక్షలు.