పవన్ చిన్న కుమార్తె డిక్లరేషన్
NEWS Oct 02,2024 05:17 am
పవన్ కల్యాణ్ తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. తిరుమల కొండపైకి పవన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి వెళ్లారు. పవన్ చిన్న కుమార్తె పలీనా అంజని తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పలీనా అంజని మైనర్ కావడంతో తండ్రిగా పవన్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.