వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
NEWS Oct 02,2024 01:22 pm
ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామంలోగల పురాతన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం నుండి స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై దసరా వరకు కొనసాగుతాయని ఆలయ అర్చకులు అన్వేష ఆచార్యులు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం శ్రీ వారి వాహన సేవ, కచేరి వద్ద హారికథ కాలక్షేపం జరుగుతుందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.