భాషిర్ పల్లిని గ్రామ పంచయితిగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కు వినతి
NEWS Oct 02,2024 08:42 am
భాషిర్ పల్లిని గ్రామ పంచయితిగా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కు విన్నతి. రాయికల్ మండల చింతలూరు గ్రామ హామ్లెట్ గ్రామం భషీర్ పల్లి ని గ్రామ పంచాయతీ గా ఏర్పాటు చేయాలనీ కోరుతూ బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేసిన భషీర్ పల్లి ప్రజలు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.