అంగన్వాడి గుడ్లల్లో పురుగులు దర్శనం...
NEWS Oct 02,2024 04:49 am
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం వల్లంపల్లి గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో వచ్చిన గుడ్లల్లో పురుగులు రావటంతో వినియోగదారులు అవక్కాయ్యారు. వల్లంపల్లి గ్రామానికి చెందిన బాస్కర్ అనే వ్యక్తి స్థానిక అంగన్వాడి సెంటర్ కి వెళ్లి గుడ్లు తీసుకొచ్చాడు, తెచ్చిన గుడ్లను విప్పి చూడగా పురుగులు ఉండడంతో ఒకసారిగా ఆందోళన చెందాడు. పిల్లలకు పౌష్టికాహారం కోసం అందించే గుడ్లలో పురుగులు రావడం, కుళ్ళిపోయిన గుడ్లు కనబడడంతో ఆవేదన వ్యక్తం చేశాడు.