రద్దీ బస్సులో ప్రయాణీకులకు అస్వస్థత
NEWS Oct 02,2024 01:37 pm
దసరా సెలవులు మొదలవ్వడంతో బస్సుల్లో రద్దీ మరింతా పెరిగిపోయింది. ఈ క్రమంలో జగిత్యాల ఆర్టీసి బస్సులో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల కొత్త బస్టాండ్ నుండి ఆలూరు, రంగపేట, విరాపూర్ మీదుగా దావాన్ పెల్లికి సుమారు 150 మంది ప్రయాణికుల వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు యువతులు సొమ్మసిల్లి పడిపోయారు. స్థానికులు గ్రహించి బస్సు ఆపి ప్రథమ చికిత్సా చేశారు. బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.