మెట్ పల్లి వాస్తవ్యుడు కలెక్టర్ అనుదీప్ కు ప్రభుత్వ నుండి ప్రశంసాపత్రం
NEWS Oct 01,2024 06:40 pm
సీనియర్ సిటిజన్ల సంక్షేమం కోసం హైదరాబాద్ జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషికి రాష్ట్ర ప్రభుత్వం నుండి మెట్ పల్లి వాస్తవ్యుడైన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తనకు దక్కిన ఈ గౌరవంపై అనుదీప్ సంతోషం వ్యక్తం చేస్తూ, సమాజంలోని ఇలాంటి బలహీన వర్గాల కోసం పని చేసే బాధ్యతను మరింత పెంచిందన్నారు.