మరింత బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు!
NEWS Oct 01,2024 04:03 pm
తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని TTD ఈవో శ్యామలరావు తెలిపారు. గతంలో కంటే ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ నెల 4న శ్రీవారికి CM చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో VIP, సిఫార్సు దర్శనాలు రద్దు చేశామన్నారు. ఉత్సవాల సమయంలో రోజుకు 24 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని, గరుడ సేవ రోజు 3.50 లక్షల మంది వస్తారని అంచనా వేసినట్లు చెప్పారు.