సోషల్ మీడియా ప్రతినిధులతో MLA సమావేశం
NEWS Oct 01,2024 03:54 pm
మడకశిర పట్టణంలోని R&B వసతి గృహంలో సోషల్ మీడియా ప్రతినిధులతో మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమాల తిప్పేస్వామి సమావేశమై చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, మండల కన్వీనర్లు మద్దనకుంటప్ప లక్ష్మీనారాయణ, దాసిరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.