లేపాక్షిలో మండలస్థాయి చెకుముకి పోటీలు
NEWS Oct 01,2024 03:50 pm
లేపాక్షిలో మండలలోని ఓరియంటల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి విజ్ఞాన పరీక్ష పోటీలు నిర్వహించినట్లు జన విజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు రాంప్రసాద్, కార్యదర్శి హనుమంతు తెలిపారు. మండల వ్యాప్తంగా వివిధ పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థులు ఓరియంటల్ పాఠశాలలో జరిగిన చెకుముకి విజ్ఞాన పరీక్షలకు హాజరయ్యారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.