జిల్లా రెడ్డి సంఘం కోశాధికారికి సన్మానం
NEWS Oct 01,2024 03:49 pm
జగిత్యాల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఎన్నికలలో కోశాధికారిగా భారీ మెజార్టీ తో గెలిచిన నేరెళ్ల భూంరెడ్డిని మల్యాల రెడ్డి సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా భూంరెడ్డి మాట్లాడుతూ రెడ్డిల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్యాల రెడ్డి సంఘం అధ్యక్షుడు ఎల్లాల జనార్దన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నేరెళ్ల శ్రావణ్, రాజేశ్వర్, శ్రీనివాస్, లింగారెడ్డి, జీవన్, కిష్టయ్య, ఎల్లారెడ్డి, రాజేశం తదితరులు పాల్గొన్నారు.