సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సాధించాలి
NEWS Oct 01,2024 03:48 pm
రైతులు సేంద్రియ ఎరువుల వాడకంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిందూపురం ఏడిఏ అల్తాఫ్ అలీ ఖాన్ రైతులకు సూచించారు. లేపాక్షి మండల పరిధిలోని నాయన పల్లిలో మొక్కజొన్న పంటలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి శ్రీలత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మొక్కజొన్న ఆశిస్తున్న కత్తెర పురుగు నివారణ చర్యలపై ఏడిఏ రైతులకు పలు సూచనలు సలహాలను అందజేశారు.