తల్లి అంజనాదేవి పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మీ ఇంటి చిన్నోడు ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అని యాంకర్ అనగానే అంజనమ్మకి ఆనందం పొంగిపోయింది. పవన్ చిన్ననాటి విషయాల గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. పవన్ ఎన్నికల ముందు ఒక ఆందోళనలో భాగంగా రోడ్డుమీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందని ఆమె అన్నారు. చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ.. చేయాలనుకున్నది చేసేసేవాడు అని అన్నారు. అమ్మ మనసు అనే ఈ ఇంటర్వ్యూ రానుంది.