అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
NEWS Oct 01,2024 01:58 pm
జగిత్యాల కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాంబాబు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విస్తృత సేవలు అందించిన వృద్ధులను సన్మానించారు. వారికి క్రీడలను నిర్వహించి బహుమతులను అందజేశారు. వయోవృద్ధుల సంక్షేమ చట్టం గురించి వివరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి, డిడబ్ల్యూఓ నరేష్ తదితరులున్నారు.