దుబాయ్ లో ఉద్యోగ అవకాశాలు
NEWS Oct 01,2024 02:25 pm
జగిత్యాల: దుబాయిలో డెలివరీ బాయ్స్ ఉద్యోగాల కోసం టామ్ కం వారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో ఈనెల 5న ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్తెమ్మ తెలిపారు. పాస్పోర్ట్, టూ వీలర్ ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి 21 నుండి 40 సంవత్సరాల వయసు కలిగిన వారు అర్హులన్నారు. అర్హత, ఆసక్తి గలవారు జగిత్యాల ధరూర్ క్యాంప్ లోని అంబేద్కర్ భవన్ లో జరిగే ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.