స్కూల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు
NEWS Oct 01,2024 04:49 pm
కోరుట్ల: గడి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. విద్యార్థినీలు పువ్వులు తెచ్చి బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. బతుకమ్మను అందంగా పేర్చిన విద్యార్థినిలు హరిప్రియ, దీక్షిత, వేదికలకు వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు భూసా మాధురి బహుమతులను ప్రదానం చేశారు. విద్యార్థులకు అంకుల్ కిరణం రాజేంద్ర ప్రసాద్ పలకలు ఇచ్చారు. ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు, ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్, సురేఖ, ఫాతిమా, ధనలక్ష్మి పాల్గొన్నారు.