9 నెలల గడుస్తున్నా పాలన మెరుగుపడలేదు
NEWS Oct 01,2024 12:49 pm
జగిత్యాల జిల్లాలో శానిటేషన్ నిర్లక్ష్యంతో విజృంభిస్తున్న విషజ్వరాలపై బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా విషజ్వరాలు ప్రబలి ప్రజలు చనిపోతున్న ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందన్నారు. 9 నెలలు నడుస్తున్నా ప్రభుత్వ పాలన మెరుగు పడలేదని, అధికారులు ప్రజలకు సేవకులుగా ఉంటూ పని చేయాలన్నారు.