మున్సిపల్ కార్మికుల ఆరోగ్య రక్షణ
మా బాధ్యత: చైర్పర్సన్ జ్యోతి
NEWS Oct 01,2024 12:48 pm
స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పట్టణం పరిశుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషించే పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణ తమ బాధ్యత అని, అందుకనే కార్మికులకు ESI భీమ కల్పించడంతో పాటు.. హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు.