ఘనంగా బతుకమ్మ సంబురాలు!
NEWS Oct 01,2024 12:29 pm
మల్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక వాగ్దేవి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కరస్పాండెంట్ నరేష్ విద్యార్థులందరికీ మన సంస్కృతి సాంప్రదాయాలు, వాటి విలువలు తెలిపే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలతో, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.