ముగ్గురు పిల్లలున్నా పోటీ చేయొచ్చు!
NEWS Oct 01,2024 12:05 pm
సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే ఆశావాహులకు రేవంత్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సర్పంచ్‌గా పోటీ చేయాలి అంటే ఇద్దరు పిల్లలు మించి ఉండకూడదనే నిబంధన ఉండేది. కానీ ఆ నిబంధనను తొలగిస్తూ ముగ్గురు లేదా ఆపై ఎంతమంది పిల్లలున్నా కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీకి అర్హులు అవుతారని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు.