క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై
NEWS Oct 01,2024 12:28 pm
మల్యాల క్రాస్ రోడ్ ప్రాంతంలోని క్రికెట్ స్టేడియాన్ని స్థానిక ఎస్సై నరేష్ పరిశీలించారు. ఈ నెల 4 నుంచి జరగబోయే ఎంపిపిఎల్ సీజన్-1 క్రికెట్ టోర్నీ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్సై తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇది ఇలా ఉండగా, 6 టీం సభ్యుల ఎంపిక, ఫ్రాంచెస్ ప్రక్రియ పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. స్టేడియం యజమాని పృథ్వీరాజు తన సొంత ఖర్చులతో క్రీడాకారులకు బ్యాట్లు కొనిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.