అలరించిన ముందస్తు బతుకమ్మ సంబరాలు
NEWS Oct 01,2024 12:27 pm
బతుకమ్మ సంబరాలలో భాగంగా మంగళవారం జగిత్యాల పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో జరిగిన ముందస్తు బతుకమ్మ సంబరాలు అలరించాయి. విద్యార్థినీలు, అధ్యాపకులు ఆకర్షనీయమైన బతుకమ్మలు తయారుచేసి సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బతుకమ్మ ఆటపాటలతో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు జయమ్మ, ఉపాధ్యాయులు రజిత, శ్రీలత, రాధిక, ఉమారాణి, అనిత, బోనగిరి దేవయ్య తదితరులు పాల్గొన్నారు.