గిటార్: మెరిట్ సాధించిన మెట్ పల్లి విద్యార్థిని
NEWS Oct 01,2024 12:25 pm
మెట్ పల్లి విద్యార్థిని గోరుమంతుల హరిణి ప్రతిభ చూపింది. హైదరాబాద్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మల్కాజ్ గిరి ఏదులాబాదులో చదువుతో పాటు గిటారులో ప్రావీణ్యం పొందుతూ ట్రినిటీ కాలేజీ లండన్ వారు నిర్వహించిన గిటార్ ఎగ్జామ్ లో ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ లో మెరిట్ సాధించింది. విద్యార్థినికి స్కూల్ ప్రిన్సిపాల్ మధులత సర్టిఫికెట్ అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ రాములు, గిటార్ టీచర్ సత్య ప్రకాష్, స్కూల్ స్టాప్, రాష్ట్ర గురుకుల పేరెంట్ కమిటీ సభ్యులు విద్యార్థినిని అభినందించారు.