ఘనంగా బాలయోగి జయంతి వేడుకలు
NEWS Oct 01,2024 12:19 pm
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో స్వర్గీయ జిఎంసి బాలయోగి 73 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ జడ్పిటిసి గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైస్కూల్ హెచ్ఎం సూర్యకుమారి పాల్గొని బాలయోగి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.