ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసిన కలెక్టర్
NEWS Oct 01,2024 12:15 pm
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, అధికారులను ఆదేశించారు. యల్లనూరు మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మంగళవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీలో భాగంగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ల సొమ్మును జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు.